Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఆర్ముడ్ రిజర్వు పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి దర్బార్..!

Nalgonda : ఆర్ముడ్ రిజర్వు పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి దర్బార్..!

నల్లగొండ, మన సాక్షి :

పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని జిల్లా పోలీస్ కార్యాలయం లో ఆర్ముడ్ రిజర్వు సిబ్బందికి ఏర్పాటు చేసిన “దర్బార్” కార్యక్రమంలో జిల్లా ఎస్పి అన్నారు. ఆర్మర్డ్ రిజర్వు సిబ్బందికి నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో జిల్లా ఎస్పి సాయుధ సిబ్బంది తో మాట్లాడి వారికి విధినిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వినతులను అడిగి తెలుసుకునీ సమస్యలను వెంటనె పరిష్కరించే విధముగా కృషిచేస్తాను అని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ లో సాయుధ దళ పోలీస్ పాత్ర కీలకం అని, జిల్లా లో సాయుధ దళ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. సిబ్బంది విధులను చక్కగా నిర్వహించడం తో పాటు ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సంక్షేమం పై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని ఇందుకోసం ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజు వ్యాయామం, క్రీడలు,యోగ చేయడం అలవర్చుకోవాలని సూచించారు.

పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. పోలీసులు వృత్తి నిర్వహణలో నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. నిరంతరం విధులలో ఉండే సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబపరమైన, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.

ఈజీ మనీ అంటూ ఆన్లైన్ యాప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోవద్దని, అలాంటి లోన్ ఆప్స్ జోలికి వెళ్లకూడదని అన్నారు. ఆర్ధిక పరంగా ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని అందుకు కావలసిన సలహాలు తెలుసుకోనీ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని అన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, మంచిప్రవర్తన తో విదులు నిర్వర్తించాలని అన్నారు. సిబ్బందికి విధులలో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకొని వారిపై ఒత్తిడి లేకుండా అందరికి సమానంగా విధులు నిర్వహించేలా డ్యూటీలు వేయాలని అధికారులకు ఎస్పి ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్మర్డ్ రిజర్వు డీఎస్పీ శ్రీనివాసులు,ఏ. ఓ శ్రీనివాసులు, ఆర్ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, శ్రీనివాస్, హరిబాబు, ఆర్.ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో 118 వాహనాలు, 220 లీటర్ల మద్యం సీజ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు