Miryalaguda : సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు అవగాహన..!
Miryalaguda : సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు అవగాహన..!
మిర్యాలగూడ, మన సాక్షి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని జప్తివారిగూడెం గ్రామంలో “వికసిత్ కృషి సంకల్ప అభియాన్” కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రయోగశాల నుంచి భూమికి అనే నినాదంతో జిల్లా వ్యాప్తం గా ఈ నెల 29 నుంచి జూన్ 12వ తేదీ వరకు రైతుల వద్దకే వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లి సస్య రక్షణ శాస్త్రవేత్త డి ఆదర్శ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాదు నుండి ఐ.సి.ఏ.ఆర్ శాస్త్రవేత్తలు, కే.వి.కే-గడ్డపల్లి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు బృందాలుగా ఏర్పడి గ్రామాలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే సస్య రక్షణ శాస్త్రవేత్త డి ఆదర్శ్ మాట్లాడుతూ వానకాలంకి అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, ఎరువుల యాజమాన్య పద్దతలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, భూసార పరీక్షలు, డ్రోన్ వినియోగం, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.

అలాగే నేరుగా విత్తే వరి సాగు గురించి వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. తదుపరి ప్రస్తుతం రైతులు ఒకే పంట పై ఆధార పడకుండా ఇతర మార్గాలైన పట్టు పరిశ్రమ పై మొగ్గు చూపాలని కోరారు. అలాగే భారతదేశంలో 50 శాతానికి పైగా జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉందని కావున వ్యవసాయంలో తీసుకువచ్చే కొత్త శాస్త్రీయ పద్ధతులను రైతులు ఉపయోగిస్తే ఎంతో లాభదాయకమని తెలిపారు.
ఈ క్రమంలో డా జి ఆర్ రామకృష్ణ మూర్తి, సైంటిస్ట్ మాట్లాడుతూ భారత జనాభా రోజు రోజుకి పెరిగిపోవడం వలన ఆహార భద్రతపై కేంద్రం దృష్టి సారించి రైతులకు ఉపయోగపడే స్కీములను సబ్సిడీలను అందిస్తుందన్నారు. రైతులు అందరూ కేవలం ఒకే పంట పై ఆధార పడకుండా సమగ్ర వ్యవసాయ విధానం లో భాగంగా వరితో పాటు, కూరగాయలు, పండ్ల మొక్కలు, పెరటి కోళ్లు, పశువులు, చేపల పెంపకం చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా యామిని, సైంటిస్ట్ మాట్లాడుతూ, అలాగే హానికరమైన పురుగుమందులు మరియు ఎరువులను వాడకుండా సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వ్యవసాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షఫీ, రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
Tahsildar : భూ భారతి గ్రామ సదస్సుల తేదీలు ఇవే.. సద్వినియోగం చేసుకోవాలి..!
-
BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : మిర్యాలగూడలో 118 వాహనాలు, 220 లీటర్ల మద్యం సీజ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి..!
-
BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!









