Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు..!

Suryapet : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు..!

సూర్యాపేట, మనసాక్షి :

రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలుతీసుకుంటామని, మున్సిపాలిటీ తో సమన్వయం చేసుకొని జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం అండర్ పాస్ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్ ఆక్రమణలను పరిశీలించారు.

స్థానికంగా ఉన్న వ్యాపారస్తులతో మాట్లాడి రోడ్డు ఆక్రమణల వల్ల తలెత్తే సమస్యలను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను, బోర్డులను తొలగించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతుందనీ,ప్రజలు వారి అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి పెద్ద సంఖ్యలో వచ్చి పోతున్నారని దానితో జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీ బాగా పెరుగుతున్నది దానికి అనుగుణంగా పోలీసుల వాహనాల రద్దీని పునరుద్ధరిస్తూ పని చేస్తున్నారు అని తెలిపారు.

రోడ్లని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులకు, సాధారణ ప్రజలకు, బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. దుకాణదారులు, వ్యాపారులు ఎవరు కూడా రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని సూచించారు.

రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత మున్సిపాలిటి అధికారులతో కలిసి రోడ్డు ఆక్రమించిన వ్యాపారాలను తొలగిస్తామని దీనిపై జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు వారి వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేస్తున్నారు అన్నారు.

ప్రజల సౌకర్యార్థం రోడ్ల ఆక్రమణలను తొలగిస్తాం అన్నారు. వ్యాపారులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. దుకాణ దారులు వారి దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఎస్పి వెంట ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం, పట్టణ ఎస్ ఐ వెంకన్న, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

  1. USA : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం..!

  2. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  3. CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!

  4. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  5. Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. ఈరోజు రేట్లు..!

మరిన్ని వార్తలు