Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

MLA : పొలం పనుల్లో ఎమ్మెల్యే.. అందరికి ఆదర్శం..!

MLA : పొలం పనుల్లో ఎమ్మెల్యే.. అందరికి ఆదర్శం..!

నకిరేకల్, మనసాక్షి:

నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యే వీరేశం తానే స్వయంగా వ్యవసాయ పనులలో పాల్గొనడం విశేషం.

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం తన వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా నాటు వేసే పనిలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిమగ్నమయ్యారు. నకిరేకల్ మండలం కడపర్తి రెవెన్యూ శివారులో తనకు ఉన్న వ్యవసాయ భూమిలో మంగళవారం వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని మహిళా కూలీలు ప్రారంభించారు.

తన వ్యవసాయ క్షేత్రం లో వరి నాట్ల సందర్బంగా స్వయంగా ట్రాక్టర్ తో పొలం దున్నడం, వరాలు చెక్కడంతో పాటు, నారు కట్టలు పంచి వేయడం వంటి పనులను చేశారు. అక్కడ ఉన్న కూలీల తొ కలిసి పొలం పనులు చేస్తూ అలసట లేకుండా సాయంత్రం వరకు వ్యసాయం పనులు చేశారు.

ఈ సందర్బంగా అక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, కూలీలు ప్రజా నాయకులు అంటే ఇలా ఉండాలని అలాంటప్పుడే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయని అన్నారు. చిన్నానాటి నుండి వ్యవసాయం పైన మక్కువ ఉండడం తోనే నా వరి నాటు పనులు స్వయంగా చేసుకుంటే సంతృప్తిగా ఉంటుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  2. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  3. Hyderabad : హైదరాబాదులో బాంబు బెదిరింపు కలకలం..!

  4. Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. ఈరోజు రేట్లు..!

  5. CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!

మరిన్ని వార్తలు