Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.. సోషల్ మీడియాలో వైరల్..!

Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.. సోషల్ మీడియాలో వైరల్..!

మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :

నల్గొండ జిల్లాలో కోడి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తన కోడి కాలు విరగొట్టాడంటూ వృద్ధురాలు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నల్లగొండ జిల్లా.. నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉంది. గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గేదెల వద్ద గడ్డి లో గింజలు తినేది. అయితే తన గేదెల వద్ద గడ్డి తొవ్వుతున్న గంగమ్మ కోడిని ఆగ్రహంతో రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేష్ ప్తె కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరున విలపిస్తూ *రాత్రి* నకిరేకల్ .పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నా కళ్ళముందే కోడిని కర్రతో కొట్టి కాళ్లు విరగొట్టాడని. నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు రాకేష్ కు శిక్ష పడాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను ఇంటికి పంపించేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MOST READ : 

  1. Mahindra : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ రెవెక్స్ విడుదల.. రూ. 8.94 లక్షల నుంచే ధరలు..!

  2. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

  3. Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

మరిన్ని వార్తలు