Penpahad : మళ్లీ మొదలైన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లొల్లి..!
Penpahad : మళ్లీ మొదలైన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లొల్లి..!
పెన్ పహాడ్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లాలో మళ్లీ మొదలైన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ వివాదం. పెన్ పహాడ్ మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో గత ప్రభుత్వం హయాంలో 125 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసినది. 100 ఇండ్లకు గాను గ్రామ ప్రజల సమక్షంలో ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా వచ్చిన దరఖాస్తులలో పెన్ పహాడ్ రైతు వేదికలో లాటరీ ద్వారా 100 ఇండ్ల కు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగినది.
మిగిలిన 25 ఇండ్లకు గ్రామానికి చెందిన నిరుపేదలు గృహాలలో నివాసం ఉంటున్నారు. కాగా మంగళవారం పెన్ పహాడ్ ఎంపీడీవో జానయ్య సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాల మేరకు మంగళవారం చీదెళ్ల గ్రామంలో మిగిలిన 25 డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న వారిని కాలి చేయాలని ఎంపీడీవో ఏ జానయ్య ఆదేశాలు జారీ చేసినారు.
గృవాలలో నివాసం ఉంటున్న వారు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం జరిగిన ఎనిమిది ఏళ్ల తరువాత పంపిణీ చేసినారు. మిగిలిన 25 ఇండ్లలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయటం ఏమిటని ప్రజలు ఎంపీడీవో ఏ జానయ్యాను ప్రశ్నిస్తున్నారు. మండల పరిధి లో సింగారెడ్డి పాలెం లో 128 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసినది గత ప్రభుత్వం 102 మంది ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి పంపిణీ చేసినది.
మిగిలిన 26 డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇల్లు లేని నిరుపేదలు కొన్ని ఎండ్ల నుండి నివాసముంటున్నారు. మంగళవారం ఎంపీడీవో ఏ జానయ్య 26 ఇండ్లలో నివాసం ఉంటున్న వారు ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో నివాసదారులు దిక్కుతోచని పరిస్థితిలో అయోమోయంలో పడిపోయారు.
పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారిని ఏ జానయ్య ను మన సాక్షి దినపత్రిక ప్రతినిధి వివరణ కోరగా జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆదేశాల మేరకే చీదెళ్ల లో 25 ఇండ్లు ఖాళీ చేయాలని తెలిపినామని ఆయన అన్నారు, సింగారెడ్డి పాలెం లో 26 ఇండ్లలో నివాసం ఉంటున్న వారిని కాళీ చేయాలని ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపినారు.
చీదెళ్ళ , సింగారెడ్డి పాలెం ఈ రెండు గ్రామాలలో ఇంటి జాగా లేని వారికి, అసలు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ కమిటీ వారు ఎంపిక చేసిన వారికి చిదెళ్ల లో 25 మంది లబ్ధిదారులను, సింగారెడ్డి పాలెం లో 26 ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపినారు. ఈ కార్యక్రమములో హౌసింగ్ బోర్డు ఏ ఈ రాంబాబు, ఏపీవో రవి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్.. ఇక పర్యాటకుల సందడి.. ( వీడియో)
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!
-
GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!









