Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

కామారెడ్డి, మన సాక్షి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం కురిసిన , భారీ వర్షానికి పెద్ద చెరువు అలుగు ఉదృతంగా ప్రవహించడంతో హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీటితో జలామయం సంతరించుకుంది. కాలనీలో వరద నీటి ఉధృతితో ,ప్రవహించడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడి , స్థానికులు ఇబ్బందులు పడ్డారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్డు ప్రాంతంలో రేకుల షెడ్డు నిర్మాణం వద్ద ఉన్న మూడు కార్లు వరదలో కొట్టుకుపోయాయి. ఈ భారీ వర్షానికి ఆయా కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జలమయమైన కామారెడ్డి : 

జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి చెరువు, అలుగు ప్రమాద కర స్థాయిలో ప్రవహిస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం 180 మిల్లీ మీటర్లు, రాజంపేట మండలంలో అత్యధికంగా 360 మిల్లీ మీటర్లు, బిక్నూర్ మండలంలో 238 మిల్లీ మీటర్ల, దోమకొండ మండలంలో 202 మిల్లీ మీటర్లు, మాచారెడ్డి మండలంలో 190 మిల్లీ మీటర్లు ఆయా మండలాల్లో భారీ వర్షం కురిసింది.

కామారెడ్డి పట్టణ కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు వరదల కారణంగా ఇల్లు నీట మునిగి, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీలలో రోడ్లు అన్నీ జలా మయంతో వరదలు ,ప్రవహించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వెళ్ళే రైలు మార్గం మధ్యలోని తల మడ్ల గ్రామం వద్ద ,రైలు పట్టాల క్రింద నుండి వర్షానికి భారీ వరదలు ప్రవహించడంతో, రైలు ప్రయాణం రాకపోకలు నిలిపి వేశారు. ఈ భారీ వర్షాలకు ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

వీడియో

MOST READ : 

  1. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

  2. Agricultural Tools : సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు.. దరఖాస్తు ఆహ్వానం..!

  3. Heavy Rain : భారీ వర్షాలు.. రేపు ఆ జిల్లాలో పాఠశాలకు సెలవు..!

  4. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

మరిన్ని వార్తలు