Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : 24 గంటల్లో హత్య కేసు నిందితుడి అరెస్టు.. నల్లగొండ ఘటనలో సంచలన విషయాలు..!

Nalgonda : 24 గంటల్లో హత్య కేసు నిందితుడి అరెస్టు.. నల్లగొండ ఘటనలో సంచలన విషయాలు..!

నల్లగొండ, మన సాక్షి :

ఈనెల 28వ తేదీన పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజీ ముందు జరిగిన హత్య కేసులో నల్లగొండ పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు నల్లగొండ డిఎస్పి శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం డిఎస్పి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిద్రిస్తున్న వ్యక్తి తలపై బండరాయితో కొట్టి అయితే చేసినట్లు తెలిపారు.

పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్ సిరాజ్ ను నేరస్తునిగా గుర్తించి శుక్రవారం పట్టణంలోని రెహమాన్ బాగ్ వద్ద నేరస్తుడిని పట్టుకున్నట్లుడిఎస్పి తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్ సిరాజ్ నెల రోజుల క్రితం మృతునికి తెలిసిన హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర లారీ క్లేనర్ గా పనిచేస్తున్నాడు.

ఒకరోజు లోడ్ తీసుకొని నల్గొండ నుండి పోతున్న సమయంలో లారీ డ్రైవర్ తో గొడవపడగా లారీ డ్రైవర్ అతన్ని అక్కడే దింపేసి వెళ్లిపోయాడని అప్పటినుండి షేక్ సిరాజ్ నల్లగొండ పట్టణంలో ఉంటూ అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఐదు రూపాయల భోజనం చేస్తూ చుట్టుపక్కల అడుక్కుంటూ క్యాంటీన్ వద్ద పడుకునే వాడని తెలిపారు.

ఇదే క్రమంలో ఈ నెల 27న రాత్రి పది గంటల సమయంలో ఇతను పడుకునే స్థలంలో చింతకింది రమేష్ హత్యకు గురైన వ్యక్తి పడుకున్నాడని రాత్రి సమయంలో షేక్ సిరాజ్ వచ్చి తాను పడుకున్న స్థలామ్లో నువ్వు ఎందుకు పడుకుంటున్నావని గొడవ దీంతో రమేష్ఈ స్థలం నీది కాదు నీ అయ్యది కాదు అని ఎదిరించాడు.

దాంతో అక్కడి నుంచి కక్షతో వెళ్లిపోయిన సిరాజ్ ఎలాగైనా రమేష్ ను అంతం చేయాలని మళ్లీ గంటకు వచ్చి నిద్రిస్తున్న రమేష్ తలపై బండరాయితో కొట్టి చంపివేసి వెళ్లినట్లు డిఎస్పి తెలిపారు.నేరస్తుడు నేరం కు ఉపయోగించిన బండ రాయి. రక్తపు మరకలు కలిగిన నేరస్తుని ఒంటి మీది దుస్తులు. స్వాధీన పరచుకున్నట్లు డిఎస్పి తెలిపారు.

ఇట్టి కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, వెంటనే స్పందించి సీరియస్గా తీసుకొని డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బృందాలతో కేవలం 24 గంటలలోపు చేదించి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్సై వెంకట్ నారాయణ, ఏఎస్ఐ వెంకట్ యాదవ్, సిబ్బంది రబ్బాని, షకీల్, శ్రీకాంత్, శంకర్, జానకి రాములు, సైదులు ను ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించడం జరిగింది.

MOST READ : 

  1. Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!

  2. Hyderabad : దేవుడిచ్చిన బిడ్డ.. ఖైరతాబాద్ మహా గణపతి వద్ద క్యూలైన్లో మహిళ ప్రసవం..!

  3. Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

  4. National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!

  5. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

మరిన్ని వార్తలు