Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి..!

Suryapet : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి..!

సూర్యాపేట, మనసాక్షి :

రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లోరాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ ఓటరు జాబితా తయారి, ప్రచురుణ, పోలింగ్ స్టేషన్ల వద్ద జాబితా ప్రచురణ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 28వ తేది న ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ ల లో ప్రచురించడం జరిగిందని, జిల్లాలో 486 గ్రామ పంచాయతీ ల లో మొత్తం 6,94,819 మంది ఓటర్లు ఉన్నారని,4388 వార్డులు ఉన్నాయని, 4403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ నెల 30 న మండల స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఆగస్టు 30 సాయంత్రం లోపు ఓటరు జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఎంపిడిఓ లకి తెలియజేయాలని అక్కడికక్కడే సవరించి సెప్టెంబర్ 2 న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 2 న తుది ఓటరు జాబితాను వార్డుల ప్రకారం పబ్లిష్ చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక ఓటరుకు రెండు చోట్ల ఓటుకు ఆస్కారం లేదని , ఒక్క చోట మాత్రమే
నమోదు  చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. చనిపోయిన ఓటర్ల వివరాలను కుటుంబ సభ్యుల ఆమోదం తీసుకొని తదుపరి తొలగిస్తామని తెలిపారు.

ఈ సమావేశం లో జెడ్పి సీఈవో వి వి అప్పారావు, డిపిఓ యాదగిరి,డిఎల్పిఓ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి కొప్పుల వేణారెడ్ది,రాజేశ్వరరావు, ఆజాద్,బిజెపి పార్టీ నుండి హబీద్, క్రాంతి,సిపిఐ ఎం నుండి కోట గోపి,బి ఆర్ ఎస్ నుండి బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు,వై ఎస్ ఆర్ సి పి నుండి రమేష్, సి పి ఐ నుండి వెంకటేశ్వర్లు,సి పి ఐ ఎం ఎల్ నుండి న్యూ డెమోక్రసి డేవిడ్ కుమార్, ఎలక్షన్ డి టీ వేణు అధికారులు ,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!

  2. District collector : జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకు రేపటితో ముగియనున్న గడువు.. అర్హులంతా దరఖాస్తులు చేసుకోవాలి.!  

  3. Heavy Rain : నిండు గర్భిణి మహిళకి పురిటి నొప్పులు.. జేసీబీ సాయంతో ఒడ్డు దాటింపు..!

  4. Pocharam Project : నిజాం తొలి ప్రాజెక్ట్.. భారీ వరదలకు తట్టుకున్న పోచారం ప్రాజెక్టు.. వివరాలు ఇవీ..!

మరిన్ని వార్తలు