Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో భగ్గుమన్న బీ ఆర్ ఎస్ శ్రేణులు..!

Miryalaguda : మిర్యాలగూడలో భగ్గుమన్న బీ ఆర్ ఎస్ శ్రేణులు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

కాళేశ్వరం పై వేసిన కమీషన్ రిపోర్టు మీద అసెంబ్లీ లో జరిగిన చర్చలో ప్రతిపక్షాల గొంతునొక్కి కేటీ ఆర్, హరీష్ రావు ను మాట్లాడనివ్వకపోవటం పై, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన కెసిఆర్ పై లేనిపోని అభాండం మోపి కాళేశ్వరం పై జరుగుతున్న కేసును సిబిఐ కు అప్పజేప్పడంపై మిర్యాలగూడ బీ ఆర్ ఎస్ శ్రేణులు తీవ్రం గా ఖండించాయి.

సోమవారం మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే, మాజీ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

నిరసనకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు మార్మోగాయి. అనంతరం తిప్పన విజయసింహ రెడ్డి మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, రాష్ట్ర అవతరణ అనంతరం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉండి , తెలంగాణ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు.

కాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ పై అక్కసు వెళ్లగక్కుతూ , ఇచ్చిన గ్యారెంటిలను అమలు చేయకుండా కాలం వెల్లదిస్తూ.. కాళేశ్వరం మీద లేని పోనీ పనికిమాలిన మాటలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

కార్యక్రమములో ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి.మోసిన్ అలీ, ఎండి.యూసుఫ్, హతిరాం నాయక్, కుందూరు వీరకోటి రెడ్డి, ధనావత్ బాలాజీ నాయక్, ఎండి.షోయబ్, పద్మశెట్టి కోటేశ్వర రావు, ధీరావత్ రవి నాయక్, కుర్ర శ్రీను నాయక్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసి లు, వార్డు ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!

  2. Miryalaguda : యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతుల క్యూ.. ఒక్క బస్తా కూడా దొరక్క ఇక్కట్లు..! 

  3. Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!

  4. Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు