Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
TG News : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి వినతి..!

TG News : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి వినతి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి మంగళవారం హైదరాబాదులో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిశారు. నారాయణపేట నియోజకవర్గం లోని ధన్వాడ మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహానికి నూతన భవనాన్ని మంజూరు చేయాలని, నియోజకవర్గంలోని రోడ్డు కనెక్టివిటీ లేని తండాలకు రోడ్ల మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
MOST READ :









