Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. లభించని మరో ముగ్గురు చిన్నారుల ఆచూకీ..!

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. లభించని మరో ముగ్గురు చిన్నారుల ఆచూకీ..!

వెల్దండ, మన సాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి బూరకుంట సమీపంలో మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా, ఎర్రగుంట్ల పాలెం మండలం, బోయపల్లి గ్రామానికి చెందిన గుప్త .వెంకటేశ్వర్లు (35)గా గుర్తించారు.

భార్య దీపికతో జరిగిన గొడవల నేపథ్యంలో , పెద్ద కుమార్తె మోక్షిత (8), చిన్న కూతురు వర్షిని, (6), కుమారుడు శివ ధర్మ (4)లను తీసుకొని బైకుపై ఇంటిని వదిలి వెళ్ళాడు. కాగా బుధవారం తెల్లవారుజామున పెద్దాపూర్ గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉండడం తన పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.

కానీ తన వెంట తీసుకెళ్లిన ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఏంటి అని పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్య దీపిక ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెల్దండ పోలీసులు కూడా కేసు దర్యాప్తును చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

MOST READ : 

  1. Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!

  3. District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. ప్రభుత్వ భూములపై కీలక ఆదేశాలు..!

  4. High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!

మరిన్ని వార్తలు