Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : జర్నలిస్ట్ భాస్కర్ మృతి పట్ల ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..!
Miryalaguda : జర్నలిస్ట్ భాస్కర్ మృతి పట్ల ఎమ్మెల్యే దిగ్బ్రాంతి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ టీవీ 5 రిపోర్టర్ దండ భాస్కర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. మిర్యాలగూడలోని భాస్కర్ పార్టీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తక్షణ సహాయంగా వారి కుటుంబానికి 50 వేల రూపాయలు నగదు అందజేశారు. భాస్కర్ అకాల మరణం బాధాకరమైన విషయం అన్నారు.

ఇద్దరి కుమార్తెలకు తండ్రి లేని లోటు తీర్చలేనిదని, వారికి అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రామకృష్ణ, బండి యాదగిరిరెడ్డి పలువురు జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.
MOST READ :









