Miryalaguda : ఎమ్మెల్యే కీలక ఆదేశం.. అధికారులు సామాజిక బాధ్యతతో పనిచేయాలి..!

Miryalaguda : ఎమ్మెల్యే కీలక ఆదేశం.. అధికారులు సామాజిక బాధ్యతతో పనిచేయాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అధికారులు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో పనిచేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అధికారులు సక్రమంగా పనిచేయకపోతే వ్యవస్థలో మార్పులు రావు అన్నారు. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులదే ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ, ఎస్టీపి నిర్వహణ, తాగునీటి పైప్ లైన్ పనులు, డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలన్నారు.
అదేవిధంగా పెండింగ్లో ఉన్న సుందరీకరణ పనులు, మురుగునీటి గల్పర్ యంత్రం కొనుగోలు చేసే ప్రతిపాదన అమలు చేయాలన్నారు. సెంట్రల్ లైటింగ్ జాతీయ రహదారి మార్గంలో ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లై ఓవర్ బ్యూటిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
MOST READ :
-
Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!
-
Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి మరోసారి అదే మాట.. ఎంతటి పోరాటానికైనా సిద్ధం..!
-
Madgulapally : మతసామరస్యానికి ప్రతీక.. వేలంపాటలో గణపతి లడ్డు కైవసం చేసుకున్న ముస్లిం మహిళ..!
-
CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)









