క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Godavari khani: భార్యను హత్య చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

Godavari khani: భార్యను హత్య చేసిన భర్త.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

గోదావరిఖని, మన సాక్షి :

రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ పరిధి వకీల్ పల్లి ప్లాట్స్ లో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డిసిపి పి కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన కృపాకర్ వకీల్ పల్లి ప్లాట్స్ లో నివాసం ఉంటున్నాడు. 13 సంవత్సరాల క్రితం మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీ చెందిన రమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. గత సంవత్సర కాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు, వివాదాలు నెలకొన్నాయి.

అప్పటినుండి భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న మధ్యాహ్నం రమాదేవి భర్త ఇంటికి వెళ్ళింది. దానితో ఇద్దరి మధ్య వఘర్షణ తలెత్తడంతో శాంతి లోనైనా కృపాకర్ తన భార్య రమాదేవిని కత్తితో విచక్షణ విచక్షణారహితంగా దాడి చేశాడు.

తీవ్ర గాయాలైన రమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీస్ లు ప్రత్యేక టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని, నమ్మదగిన సమాచారం ఆధారంగా నిందితుడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

MOST READ : 

  1. Kabaddi : జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..!

  2. District collector : నిరుద్యోగులకు జిల్లా కలెక్టర్ శుభవార్త.. 19న జాబ్ మేళా..!

  3. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలు..!

  4. Nalgonda : రూ.232 కోట్లతో పోలీసు అధికారులకు, సిబ్బందికి క్వార్టర్స్..!

  5. Alumni : 34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

మరిన్ని వార్తలు