Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

Singareni : 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ..! 

Singareni : 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ..! 

గోదావరిఖని, మన సాక్షి :

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్ లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరి – 1 గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది.

2024 డిసెంబర్ 31 మరియు అంతకు ముందు తమ సంవత్సరకాలం సర్వీసు చేసిన వారిని భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో లేదా సర్ఫేస్ లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1 గా క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ క్రమబద్ధీకరణ విషయమై సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పొట్రు లతో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జరిపిన చర్చల అనంతరం యాజమాన్యం ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జనరల్ మేనేజర్ (పర్సనల్) , ఐ ఆర్ & పి ఎం బుధవారం అన్ని ఏరియాలకు ఒక సర్క్యులర్ జారీ చేశారు.

ఏరియాల వారీగా:

రామగుండం-2 ఏరియాలో 303 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1 గా క్రమబద్ధీకరించటం జరుగుతుంది. అలాగే భూపాలపల్లి ఏరియాలో 250 మందికి, శ్రీరాంపూర్ ఏరియాలో 241 మందికి, రామగుండం-3 & అడ్రియాల ఏరియాలలో 167 మందికి, రామగుండం-1 లో 156 మందికి, మందమర్రిలో 64 మందికి, కార్పోరేట్ లో 21 మందికి, కొత్తగూడెం ఏరియాలో 20 మందికి, మణుగూరు ఏరియాలో 19 మందికి, బెల్లంపల్లి ఏరియాలో 11 మందికి, ఇల్లందు ఏరియాలో ఆరుగురికి జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

MOST READ :

  1. Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్..!

  3. Miryalaguda : ఆ గ్రామాలలో.. నేడు పవర్ కట్.. వేళలు ఇవే..!

  4. Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!

మరిన్ని వార్తలు