ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఎంత కష్టం వచ్చిందో ఏమో.. ఏమి కష్టం వచ్చిందో తెలియదు.. పాపం కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలో మూడో నెంబర్ ట్రాక్ పై ఓ కుటుంబం గూడ్స్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలు ట్రాక్ పై చెల్లాచెదరుగా పడిపోయాయి. మృతుల్లో భార్యా భర్తలతో పాటు ఏడాది ఏడాదిన్నర చిన్నారి పాప ఉన్నట్లుగా గుర్తించారు.
శంకరాపురానికి చెందిన శ్రీరాములు (35) శిరీష (30), రిత్విక్ గా గుర్తించారు. భార్య భర్తలు గొడవ పడగా ఇద్దరిని శ్రీరాములు నానమ్మ మంధలించినట్లు తెలుస్తోంది. కాగా మీరు రాత్రి బయటకు వెళ్లగానే శ్రీరాములు నానమ్మ కూడా గుండెపోటుతో మృతిచెందినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!
-
Puls Polio : తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి.. వారికి పోలియో చుక్కలు వేయించాలి..!
-
Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!
-
District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!
-
Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!









