Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

NARAYANPET : కంటికి రూపం, ఇంటి దీపం ఆడపిల్లే..!

NARAYANPET : కంటికి రూపం, ఇంటి దీపం ఆడపిల్లే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయపేట జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కంటికి రూపం.. ఇంటి దీపం. మమతకు అపురూపం.. నిండు గుండెకు ఆడపిల్లే మణిదీపం.. అని నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ పేర్కొన్నారు.

అమ్మ కావాలి.. భార్య కావాలి.. సోదరి కావాలి.. మరి కూతురు ఎందుకు వద్దు.. అని తెలుపుతూ బాలికల హక్కులు, భద్రతపై దేశానికి విద్యార్థులే రేపటి పౌరులుగా ముందడుగులో ఉండాలని అన్నారు, ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి మంచి హోదాలో ఉండాలని అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసించడానికి చాలా కష్టపడాలి పడితేనే మంచి హోదాలో ఉంటారు అని చెప్పారు.

ప్రతి అమ్మాయి మంచి చదువు చదివి మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నత స్థానంలో ఉండాలని తెలిపారు. సమాజంలో స్త్రీ పాత్ర చాలా కీలకమని పెళ్లి విషయంలో గాని అన్ని ఆలోచించి ముందడుగు వేయాలని తెలిపారు. బాలలు, మహిళలు, యువత, నిరక్షరాస్యులను మభ్యపెట్టి హింసలకు గురిచేసే ప్రమాదం ఉందని ఇలాంటి వాటికి పాల్పడేవారిపై వెంబడే టోల్ ఫ్రీ 1098 నెంబర్ సంప్రదించితే తగిన చర్యలు ఉన్నాయని తెలిపారు.

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి వుండాలనీ బాల్యవివాహాలు, మూడునమ్మకలు,సైబర్ నేరాలు, బాలకార్మిక సమస్య పై అవగాహన ఇవ్వడం జరిగింది. వివాహ వయస్సు వచ్చాకనే పెండ్లిళ్లు చేసుకోవాలి, విద్యార్థులు అంకితభావంతో విద్యనభ్యసించి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు యువకుల చేతిలో మోసపోకూడదని పలు చట్టాల గురించి వివరించి తెలిపారు.

విద్యార్థులకు సంబంధించిన పేసా ఆక్ట్ గురించి మరియు చైల్డ్ ప్రొహిబిషన్ ఆక్ట్ చైల్డ్ లేబర్ ఆక్ట్ , బాల్య వివాహాలు, ఉచిత విద్య కోసం 10 ప్రభుత్వ పథకాలు , సర్వ శిక్షా అభియాన్, విద్యా హక్కు, ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం జాతీయ కార్యక్రమం, బేటీ బచావో, బేటీ పఢావో, మాధ్యమిక విద్య కోసం బాలికలకు ప్రోత్సాహకాల జాతీయ పథకం, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఉడాన్ ప్రోగ్రామ్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ, సుకన్య సమృద్ధి యోజన, పథకాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్, సీనియర్ న్యాయవాది నందు నామాజీ, చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్ తిరుపతయ్య లు మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి, అవగాహన కల్పించారు. తదుపరి న్యాయమూర్తి అకస్మాత్తుగా హాస్టల్ ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సెల్ లష్మిపతి గౌడ్, సీనియర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నందునమాజీ, యామిని (ప్రిన్సిపాల్), తిరుపతయ్య (డి.సి.పీ.ఓ), పోలీస్ అధికారి బాలస్వామి, అండ్ పారాలీగల్ వాలంటీర్స్ రూపిక, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. PMSBY : పీఎం సురక్ష బీమా యోజన.. రూ.20 చెల్లిస్తే చాలు.. 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే..!

  2. Suryapet : ఆయిల్ పామ్ సాగు పై క్షేత్ర సందర్శన కు వెళ్లిన రైతులు..!

  3. Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!

  4. ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

  5. TG News : తెలంగాణ రాజకీయాల్లో మరో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!

మరిన్ని వార్తలు