Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లావైద్యం

Medicine : ప్రభుత్వ దవాఖానాలో గడువు ముగిసిన మందుల పంపిణీ.. వైద్య సిబ్బందిపై ప్రజల ఆగ్రహం..!

Medicine : ప్రభుత్వ దవాఖానాలో గడువు ముగిసిన మందుల పంపిణీ.. వైద్య సిబ్బందిపై ప్రజల ఆగ్రహం..!

తుర్కపల్లి, మన సాక్షి :

తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్య వైఖరి మరోసారి వెలుగులోకి వచ్చింది. తేదీ ముగిసిన ఇంజెక్షన్ రోగికి ఇవ్వడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. రెండు రోజుల క్రితం వాసాలమర్రి గ్రామానికి చెందిన తొలిచుక్క అంజయ్య అనే వ్యక్తి కాలికి గాయమై తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స కోసం వెళ్లాడు. అక్కడ డ్యూటీ నర్స్ తేదీ అయిపోయిన ఇంజెక్షన్ ఇచ్చినట్లు సమాచారం.

అంతేకాకుండా, మరో రెండు ఇంజెక్షన్లు కూడా అదే గడువు ముగిసిన మందులతో చేసుకోవాలని రోగికి ఇచ్చి పంపించినట్లు తెలిసింది. శనివారం రోజు అంజయ్య ఆ ఇంజెక్షన్ వేసుకోవడానికి దగ్గరలోని ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించగా ఆయన మందులను పరిశీలించి అవి ఇప్పటికే తేదీ అయిపోయినవని గుర్తించారు. దీంతో రోగి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ విషయం గ్రామంలో వ్యాపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై వాసలమర్రి మాజీ ఎంపిటిసి పలుగుల నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి నిర్లక్ష్యం సహించరానిది. రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్న వైద్య సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలి. పీఎచ్‌సీ సక్రమంగా నడిచేలా జిల్లా కలెక్టర్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

గ్రామస్థులు కూడా ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోంది? మెడికల్ ఆఫీసర్ కానీ, నర్సులు కానీ మందుల గడువు కూడా చూడరా? అంటూ మండిపడుతున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు సమయానికి రాకపోవడం, కొన్నిసార్లు రారనే విషయం ప్రజలు ఆవేదనతో చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి తలుపులు ఉన్నా వైద్యసేవలు లేవు” అని వాపోతున్నారు.

ఈ ఘటనపై వైద్య శాఖ తక్షణమే స్పందించి, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పర్యవేక్షణను బలోపేతం చేసి ప్రజలకు భద్రమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మండల వైద్యాధికారిని వివరణ కోరగా రోగికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని, రోగి షుగర్ పేషెంట్ కావడంతో హాస్పిటల్ కి రాలేనని కోరగా మెడిసిన్ ఇచ్చి పంపించినట్లు, మెడిసిన్ తేదీ ముగిసిన డేట్ ను చూసుకోకుండా ఇవ్వడం తప్పేనని వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో వారికి నోటీసులు..!

  2. Nizamabad : కానిస్టేబుల్ హత్యపై సీపీ కీలక వ్యాఖ్యలు..!

  3. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!

  4. Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు