తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మాలధారణ భక్తులకు మహా అన్నదానం..!

Miryalaguda : మాలధారణ భక్తులకు మహా అన్నదానం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మిర్యాలగూడలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పులిమేడు ఆశ్రమ గురుస్వామి తాజా మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రేపటి నుండి మండల కాలం వరకు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

అయ్యప్ప, శివ, ఆంజనేయ, భవాని మాత, ఇతర స్వాములు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. అదే విధంగా రేపు చాలా గొప్ప పర్వదినమని స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ నక్షత్రమని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి వివాహ వార్షికోత్సవ రోజున అదేవిధంగా కార్తీక మాస ప్రారంభోత్సవం కాబట్టి వారి చేతుల మీదుగా ఈ మండల కాలం మహా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని మాధవి మాత సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి స్వరూపమని గత కొన్ని సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో ఏ గుడి ప్రారంభోత్సవానికైనా, ఏ పుణ్యకార్యాలకైనా వారే అన్న ప్రసాద సమర్పకులుగా ఉండి ప్రతి ఒక్కరికి కడుపునిండా భోజనం దొరికేదాకా లేదనకుండా అందరి కడుపు నింపేటటువంటి మహాతల్లి అన్నారు.

అదేవిధంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ శుభమస్తు కార్యక్రమం ద్వారా ఎన్నో వేల మంది జంటలకు వివాహ కిట్లను, ముస్లింలకు షాదీ ముబారక్ కిట్లను కుల మతాలకతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి వివాహ కిట్లను అందజేసినటువంటి ఘనత వారిదన్నారు. రేపటి నుండి జరగబోయే మహా అన్నప్రసాద కార్యక్రమంలో ప్రతి ఒక్క స్వామి పాల్గొనాలని కోరుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అయ్యప్పదేవాలయ కమిటీ చైర్మన్ ముక్కాపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై రెండు గంటలకు ముగుస్తుందని ప్రతి ఒక్క స్వామి సకాలంలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని స్వాములందరూ మాకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘసంస్కర్త గుడిపాటి నవీన్, 25 వ వార్డు ఇన్చార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి, నాయుడు గురుస్వామి, గురువారెడ్డి గురుస్వామి, బాలు నాయక్ గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Health : యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.. ఉపశమనం పొందడం ఎలా..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..!

  3. Medicine : ప్రభుత్వ దవాఖానాలో గడువు ముగిసిన మందుల పంపిణీ.. వైద్య సిబ్బందిపై ప్రజల ఆగ్రహం..!

  4. Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు