స్వగ్రామం చేరిన అమెరికాలో మృతి చెందిన కిరణ్ రెడ్డి పార్థివదేహం
స్వగ్రామం చేరిన అమెరికాలో మృతి చెందిన కిరణ్ రెడ్డి
పార్థివదేహం
నివాళులర్పించిన బి ఎల్ ఆర్, పలువురు నాయకులు
మిర్యాలగూడ, మనసాక్షి : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు క్రాంతి కిరణ్ రెడ్డి పార్ధివ దేహం స్వగ్రామానికి చేరింది. ఈ నెల 7వ తేదీన అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం విదితమే. కాగా మంగళవారం అర్ధరాత్రి పార్థివదేహం ఇంటికి తీసుకువచ్చారు. కాగా వివిధ పార్టీల నాయకులు పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కన్నీటిపర్యంతమైన అన్నారం :
సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి అమెరికాలో మృతి చెందడం పట్ల మండలం లోని అన్నారం గ్రామం కన్నీటి పర్యంతమైంది. గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్ రెడ్డి అమెరికాలో ఎమ్మెస్ చదివి ఎందుకు వెళ్ళగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో కిరణ్ రెడ్డీ అందరితో కలివిడిగా ఉండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి ఇలా అవుతాడని అనుకోలేదని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, వివిధ పార్టీల నాయకులు దుర్గంపూడి నారాయణ రెడ్డి, చిట్టిబాబు నాయక్, దేశి డి శేఖర్ రెడ్డి, అర్జున్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి :
1. అమెరికాలో మిర్యాలగూడ వాసి మృతి
2. రూ. 30 తిరిగి ఇవ్వాలని అడిగినందుకు… కొట్టి చంపారు
3. అమెరికాలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన గుత్తా, భాస్కర్ రావు









