Miryalaguda : మిల్లుల, ఇటుక బట్టీల కాలుష్యం నివారించాలి..!

Miryalaguda : మిల్లుల, ఇటుక బట్టీల కాలుష్యం నివారించాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పరిధిలోని రైస్ మిల్లులు, ఇటుక బట్టీల కాలుష్యం నివారించాలని గూడూరు గ్రామస్తులు గురువారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని రైస్ మిల్లుల పొగ ద్వారా గ్రామంలోని ఇండ్లలోకి పొట్టు విపరీతంగా పడుతుందన్నారు.
రైస్ మిల్లులో బాయిల్డ్ చేసిన నీరును రీసైక్లింగ్ చేయకుండా రోడ్డు వెంబడి వదిలి వేస్తున్నారని, దీంతో గ్రామం మొత్తానికి విపరీతమైన దుర్వాసన వస్తుందన్నారు. అద్దంకి – నార్కెట్పల్లి హైవేకు ఇటుక బట్టీల నుండి విపరీతమైన బూడిద వస్తుందని, వాహనదారులకు పాదచారుల కళ్ళలో పడి కంటి జబ్బులు వస్తున్నాయని వారు అన్నారు.
ఈ హైవేపై రైస్ మిల్లుల సమీపంలో ఈ బూడిద వల్ల యాక్సిడెంట్లు అంగవైకల్యం, మరణాలు సంభవిస్తున్నాయని వెంటనే మిల్లుల ఇటుక బట్టీల కాలుష్య నివారణకు వారు డిమాండ్ చేశారు. లేనియెడల గ్రామ ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. వినతి పత్రం అందించిన వారిలో బొంగరాల మట్టయ్య, మూగల సైదులు యాదవ్, నూకపంగా కాశయ్య తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Amrutanjan : ఐకానిక్ పసుపు బామ్.. మళ్లీ విడుదలైంది..!
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!
-
Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!
-
District collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆ కోర్సులను చదివితే భవిష్యత్తు ఉంటుంది..!









