Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

NARAYANPET : రెజ్లింగ్ లో రాష్ట్ర స్థాయి పోటీలకు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపిక..! 

NARAYANPET : రెజ్లింగ్ లో రాష్ట్ర స్థాయి పోటీలకు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపిక..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

గురువారం ధన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన 69 వ ఎస్ జి ఎఫ్ క్రీడలలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అండర్ 14, అండర్ 17 రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో నారాయణపేట జిల్లా కేంద్రం బాలికల ఉన్నత పాఠశాల కు చెందిన మనుష 7వ తరగతి విద్యార్థిని అండర్ 14, 58 కేజీల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది.

ఈనెలలొనే కామారెడ్డి లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహ్మద్ హనీఫ్ మాట్లాడుతూ విద్యార్థిని రాష్ట్రస్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కి ఎదగాలని ఆశించారు.అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని మనుష, వ్యాయమ ఉపాధ్యాయురాలు పర్వీన్ ను అభినందించారు.

MOST READ : 

  1. ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!

  2. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

  3. Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

  4. Nalgonda : ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ..!

మరిన్ని వార్తలు