Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా
ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!

ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!
వెల్దండ, మన సాక్షి:
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల విద్యుత్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు 15000 లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
వెల్దండ మండల కేంద్ర పరిధిలోని చొక్కనపల్లి గ్రామ సమీపంలో ఫామ్ హౌస్ లో విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ కోసం ఏఈ రూ. 20 వేలు డిమాండ్ చేయగా ..15 వేలు ఒప్పుకొని నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏఈ నుంచి రూ. 15 వేలు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారు. అలాగే జడ్చర్ల లోని ఏఈ నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. లంచం తీసుకుంటూ కట్టుబడిన ఇంచార్జ్ ఏఈ ని బుధవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఎసిబి డిఎస్పి జగదీష్ చందర్ వెల్లడించారు.
MOST VIEWS









