Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalagudac: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం..!

ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు.

Miryalagudac: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం..!

కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మన సాక్షి తెలుగు దినపత్రిక నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి పత్రికలు వారధిగా ఉండాలని కోరారు.

మన సాక్షి పత్రిక అతి తక్కువ కాలంలో ప్రజల ఆదరణ పొందుతుంది అని అన్నారు. ఈ పత్రికలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మన సాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్ మల్లె నాగిరెడ్డి, విలేకరి బొంగర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు