రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణ
రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణ
హైదరాబాద్, మనసాక్షి : టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి మంత్రి మల్లారెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు . వీరిద్దరి మధ్య అనేక పర్యాయాలు దూషణల పర్వం కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సారి రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపిలో ఉన్నప్పుడు తనను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు . మల్లారెడ్డి మాటల్లో.. “నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. టిడిపిలో ఉన్నప్పుడు రేవంత్ తో అనేక ఇబ్బందులు పడ్డాను. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశాడు. నా కాలేజీలు మూసివేయి ఇస్తానని బెదిరించాడు. నాకు మల్కాజిగిరి సీటు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. చంద్రబాబుకు వాస్తవాలు అన్నీ చెప్పి సీటు తెచ్చుకుని గెలిచాను. నన్ను అడుగడుగునా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని మల్లారెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి :
1. కెసిఆర్ పర్యటనకు సడన్ బ్రేక్.. హైదరాబాద్ కు తిరిగొచ్చింది అందుకేనా ?
2. తండ్రి చనిపోయిన దుఃఖం తోనే పరీక్షకు హాజరైన విద్యార్థిని
3. పెళ్లి పీటల పై వధువు మృతి .. చాటింగ్ లో ఏముంది ..?, వీడిన మిస్టరీ









