Cyber Crime : రూ.5 వేలు ఇచ్చారు.. రూ.2.9 కోట్లు కొట్టేశారు..!
సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వివిధ రూపాలలో సైబర్ నేరాలు ఆకట్టుకుంటున్నారు. 5 వేల రూపాయలు ఇచ్చి 2.9 కోట్ల రూపాయలను కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

Cyber Crime : రూ.5 వేలు ఇచ్చారు.. రూ.2.9 కోట్లు కొట్టేశారు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వివిధ రూపాలలో సైబర్ నేరాలు ఆకట్టుకుంటున్నారు. 5 వేల రూపాయలు ఇచ్చి 2.9 కోట్ల రూపాయలను కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 300% లాభం వస్తుందని ఆశపెట్టిన సైబర్ నేరగాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగిని నుంచి 2.9 కోట్లు కొట్టేశారు. తొలిసారి పెట్టుబడికి అదనంగా 5000 రూపాయలను ఇచ్చి నమ్మించారు. దాంతో ఆ ఉద్యోగి అప్పులు చేసి మరీ పలు దఫాలుగా డబ్బులు బదిలీ చేశారు.
చివరికి మోసపోయినట్లుగా గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని శేరిలింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి (45).. 2025 నవంబర్ 12వ తేదీన వాట్సప్ లో ఒక వెబ్ లింక్ వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సహకరిస్తామని లింకులో ఉంది.
ఆ లింకును క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో చేరారు. అనిల్ గోయల్ అనే వ్యక్తి ఈయనతో పరిచయం చేసుకున్నాడు. తన వద్ద షేర్ల గురించి సలహాలు తీసుకొని ఎంతోమంది కోట్ల రూపాయలు సంపాదించారని నమ్మబలికాడు. గ్రూపులో ప్రతి ఒక్కరు 300% లాభాలు పొందవచ్చునని నమ్మించాడు.
అది నిజమేనని ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. డిసెంబర్ 15వ తేదీన తొలిసారిగా 50వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా రూ. 5000 లాభం వచ్చింది. దాంతో పలుమార్లు మొత్తం 2.9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా లాభాలతో కలిపి 3.47 కోట్ల రూపాయలకు లాభం వచ్చినట్లుగా యాప్ లో చూపించింది.
అతడు అప్పులు తీసుకురావడంతో తీర్చాలని లాభం వచ్చిన షేర్లను విక్రయించాలని భావించాడు. ఈ విషయమై వాట్సాప్ గ్రూప్ లో సలహాలు ఇచ్చిన అనిల్ ను ఫోన్లో సంప్రదించగా విక్రయించడం సాధ్యం కాదని చెప్పాడు. అదనంగా డబ్బు చెల్లించాలని చెప్పడంతో మోసపోయేనని గ్రహించి సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు.
MOST READ NEWS
-
Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!
-
BIG BREAKING : సూర్యాపేట జిల్లా కారు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి..!
-
BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!
-
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం..!









