Software Engineers : పోటీపడి బీర్లు తాగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. చివరకు..!
ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. పోటీపడి బీర్లు తాగారు. 19 బీర్లు తాగారు. చివరికి మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.

Software Engineers : పోటీపడి బీర్లు తాగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. చివరకు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. పోటీపడి బీర్లు తాగారు. 19 బీర్లు తాగారు. చివరికి మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం బండవడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పోటీపడి 19 బీర్లు తాగారు. ఆ తర్వాత మృతి చెందారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ సమయంలో మనీ కుమార్ (32), పుష్పరాజ్ (28) అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోటీపడి మద్యం సేవించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఇద్దరు కలిసి 19 బడ్వైజర్ బీర్లు తాగినట్లు పోలీసులు గుర్తించారు.
ఇద్దరు అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్ గురై ఇద్దరు పరిస్థితి విషమించింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యలో మృతిచెందగా పుష్పరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.









