Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్..!

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా నియామకమైన శరత్ చంద్ర గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్..!

నల్లగొండ, మనసాక్షి.

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా నియామకమైన శరత్ చంద్ర గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన కార్పొరేషన్ అభివృద్ది కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూనిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నూతన కమిషనర్ కు మంత్రి సూచించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కార్పొరేషన్ సాధించుకున్నామని, మౌళిక సదుపాయాల కల్పనలో అగ్రగామి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అనే విధంగా కష్టపడి పనిచేయాలన్నారు.

వేల కోట్లతో ఇప్పటికే నల్లగొండ పట్టణంలో చేసిన అభివృద్ది పనులుఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంలో భాగం కావాలని చెప్పారు. సూపర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి నినాదంతో వెళ్తున్నామని అందుకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేయాలని మంత్రి నూతన కమిషనర్ శరత్ చంద్ర కు సూచించారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు..!

  2. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  4. Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు