Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Doctorate : మిర్యాలగూడ వాసి శ్రీలత కు డాక్టరేట్.. అభినంధించిన విద్యుత్ ఉద్యోగులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన శ్రీలతకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా అందజేసింది.

Doctorate : మిర్యాలగూడ వాసి శ్రీలత కు డాక్టరేట్.. అభినంధించిన విద్యుత్ ఉద్యోగులు..!

మిర్యాలగూడ,  మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన శ్రీలతకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పట్టా అందజేసింది. మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీ చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్ తూముల నారాయణ, సుగుణ ఏకైక కుమార్తె శ్రీలత. ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీ వారు కంప్యూటర్ సైన్స్ విభాగంలో పి.హెచ్.డి డాక్టరేట్ పట్టా బహుకరించారు.

ఆమె స్మార్ట్ సీడ్స్ సెలక్షన్, క్రాప్ ఈల్డ్ ఫ్రిడిక్షన్ అనే అంశం మీద కార్న్ షీడ్, మైజ్ షీడ్ మరియు ఇండియన్ ఇండియన్ ఈల్డ్ డేటా సెట్స్ ఆధారంగా మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ లో పరిశోధన సాగించారు. ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ పివి సుధా పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.

ఈ పరిశోధన వల్ల మన్నికైన సీడ్స్ ని ఆటోమేటిక్ గా చేసుకొని తద్వారా రైతులు పంట దిగుబడిని పెంచుకోవడానికి రైతులకు, వ్యవసాయ నిపుణులకు ఉపయోగకరమైనదని తెలిపారు. శ్రీలత తూముల నల్గొండ జిల్లా మిర్యాలగూడ నివాసులు. పదవ తరగతి, ఇంటర్, బ్యాచిలర్ ఆప్ కంప్యూటర్ అప్లికేషన్ ( బి.సి.ఏ ) టౌన్ ఫస్ట్ ర్యాంక్ లో పూర్తి చేశారు.

నారాయణగూడ రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఎం.ఎస్.ఐ. ఎస్ (పీజీ), జేఎన్టీయూ కూకట్పల్లి నుండి ఎం.టెక్ పట్టా సాధించి, రెడ్డి ఉమెన్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్స్ కాలేజీ, షాద్ నగర్ లో లెక్చరర్ గా కొనసాగుతున్నారు.

శ్రీలత సాధించిన విజయానికి రాష్ట్ర విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, నేతినూరి దామోదర్, 327 యూనియన్ రాష్ట్ర మాజీ నాయకులు గొడిశాల ముత్తయ్య, నేతి నూరి రిషీర, డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసచారి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కోడి రెక్క రవికుమార్, సబ్ ఇంజనీర్ సీతారామారావు, రిటైర్డ్ అకౌంట్ ఆఫీసర్ నామిరెడ్డి దయాకర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, బంధువులు తదితరులు అభినందించారు.

MOST READ 

  1. Nalgonda : అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం.. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతల అంతర్మధనం.. ఎవరు, ఎక్కడ పోటీ..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు