Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : సర్పంచులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. తొలి దశ శిక్షణ ముగింపు..!

గ్రామస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సింగారం ట్రైనింగ్ సెంటర్లో నూతన సర్పంచ్ లకు నిర్వహిస్తున్న తొలి దశ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్, అధికారులతో కలిసి హాజరయ్యారు.

District collector : సర్పంచులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. తొలి దశ శిక్షణ ముగింపు..!

నారాయణపేటటౌన్, మనసాక్షి:

గ్రామస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సింగారం ట్రైనింగ్ సెంటర్లో నూతన సర్పంచ్ లకు నిర్వహిస్తున్న తొలి దశ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్, అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలి దశలో 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణలో వివిధ మండలాలకు చెందిన సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ వారు రూపొందించిన కరదీపికలోని అన్ని అంశాలపై సుశిక్షితులైన మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అందించడం జరిగిందని, సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.

సర్పంచ్ లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వినియోగించాలని తెలిపారు. అనంతరం శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సుధాకర్ రెడ్డి, డి ఆర్ డి ఓ మొగులప్ప ఎంపీడీవో లు, సర్పంచ్ లు జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By : Ramakanth, Narayanpet Town

MOST READ : 

  1. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  2. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  3. Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు