Breaking Newsతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లావ్యవసాయం

Groundnuts : వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.. రైతులను సన్మానించిన మార్కెట్ కమిటీ..!

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి వచ్చిన వేరుశనగకు వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించడంతో రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది.

Groundnuts : వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.. రైతులను సన్మానించిన మార్కెట్ కమిటీ..!

వెల్దండ, మన సాక్షి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి వచ్చిన వేరుశనగకు వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించడంతో రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. మార్కెట్లో వేరుశనగ ధర మరోసారి రికార్డులకెక్కింది. ఆదివారం కనీస ధర క్వింటాల్ రూ.10 వేల 950 ఉండగా.. వేలంలో రూ. 12 వేల 9 రూపాయల ధర పలికింది.

మార్కెట్ యార్డు కు వేరుశనగ మొత్తం 487 .9 క్వింటాళ్లు, 71 మంది రైతులు తీసుక వచ్చినట్లు వారు తెలిపారు. పల్లికి అధిక ధర వచ్చినందున రైతులందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం.. రికార్డు ధర పొందిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన రైతులను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనిలా సంజీవ్ కుమార్ యాదవ్ శాలువాలతో సన్మానించారు.

MOST READ 

  1. MARATHON : మారథాన్‌ – 2026లో ప్రతిభ.. డీఎస్పీనీ అభినందించిన ఎస్పీ..!

  2. Ideal Marriage : ఐఏఎస్, ఐపిఎస్ యువ జంట ఆదర్శ వివాహం.. సాదా సీదాగా రిజిస్టర్ మ్యారేజ్..!

  3. Gun Firing : అమెరికాలో కాల్పులు.. నలుగురు భారత సంతతి వారు మృతి..!

  4. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

మరిన్ని వార్తలు