Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని మంగళవారం 4 గంటలకు విడుదల చేశారు.

TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని మంగళవారం 4 గంటలకు విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి (ఈనెల 28వ తేదీ నుంచి) నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈనెల 30వ తేదీన నామినేషన్ల చివరి తేదీగా ప్రకటించారు. అదే విధంగా ఈనెల 31వ తేదీన స్కూటీని నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. కాగా ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉంటుంది. 2996 వార్డులలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 52 లక్షల 43 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఫిబ్రవరి 13వ తేదీన ఫలితాలు వెలుపడతాయి. రాష్ట్రవ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్లో 16,031 బ్యాలెట్ బాక్స్ లను వినియోగిస్తారు. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు. ఫలితాల అనంతరం ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు లేవు. అదే విధంగా అధికారుల బదిలీలు సైతం ఉండవు.

ఇవి కూడా చదవండి : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో అన్నపూర్ణ అభయ హస్తం.. రూ.5 భోజనం ఏర్పాటు..!

  2. Groundnuts : వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.. రైతులను సన్మానించిన మార్కెట్ కమిటీ..!

  3. వికసిత పద్మం.. తెలంగాణలో ఏడుగురికి.. ఆంధ్రాలో నలుగురికి పద్మశ్రీ..!

  4. Alumni : 35 ఏళ్ల నిరీక్షణకు తెర.. సూర్యాపేటలో మిత్రుల జ్ఞాపకాల హరివిల్లు..!

మరిన్ని వార్తలు