TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!

బంగారం ధర హైదరాబాదులో భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరిగి ఆల్ టైం రికార్డు సృష్టించింది.

Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర హైదరాబాదులో భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరిగి ఆల్ టైం రికార్డు సృష్టించింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 51,300 రూపాయలు ఒక రోజే పెరిగి 16 లక్షల 70 వేల 800 రూపాయల రికార్డు స్థాయికి చేరింది. అదే విధంగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు ఒక్కరోజే 47 వేల రూపాయలు పెరిగి 15 లక్షల 31 500 రూపాయలకు చేరింది.

తులం ధర 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ బుధవారం ఒక్కరోజే 5,130 రూపాయలు పెరిగి 1, 67,080 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు ఒక్కరోజే 4700 రూపాయలు పెరిగి 1,53,150 రూపాయలకు చేరింది. కాగా ఈ ధర హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే కొనసాగుతున్నాయి.

భవిష్యత్తులో మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. గత వారం పది రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరో వారం, పది రోజుల్లో కూడా తులం బంగారం రెండు లక్షల రూపాయలకు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కిలో వెండి నాలుగు లక్షల రూపాయలకు చేరువలో ఉంది.

ఇవి కూడా చదవండి

  1. BREAKING NEWS : బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా ఆరుగురు దర్మరణం..!

  2. Nalgonda : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

  3. Gun Firing : అమెరికాలో కాల్పులు.. నలుగురు భారత సంతతి వారు మృతి..!

  4. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మరిన్ని వార్తలు