Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : భారీ అగ్నిప్రమాదం.. ఎస్.ఎల్.ఎన్ ట్రేడర్స్ పూర్తిగా దగ్ధం..!

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేవరకొండ ప్రధాన రహదారిపై ఉన్న వద్దిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన వ్యాపార సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆస్తి నష్టం వాటిల్లింది.

Nalgonda : భారీ అగ్నిప్రమాదం.. ఎస్.ఎల్.ఎన్ ట్రేడర్స్ పూర్తిగా దగ్ధం..!

గుర్రంపోడు, మన సాక్షి:

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేవరకొండ ప్రధాన రహదారిపై ఉన్న వద్దిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన వ్యాపార సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆస్తి నష్టం వాటిల్లింది. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో దుకాణంలో మంటలు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో షాపులో ఉన్న ఫర్నిచర్, ఏసీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు మరియు ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు మూడు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాద వార్త తెలుసుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నజీర్, పంచాయతీ అధికారి పురుషోత్తం గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్ధమైన సామాగ్రిని పరిశీలించి, జరిగిన నష్టంపై పంచనామా నిర్వహించారు. ప్రభుత్వ పరంగా బాధితుడికి సహాయం అందేలా చూస్తామని అధికారులు పేర్కొన్నారు.

By : Yaladri, Gurrampode

MOST READ 

  1. KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!

  2. Medaram : జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం.. కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ..!

  3. Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!

  4. Nalgonda : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు