Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!
తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. పంటలు వేసి రెండు మాసాలు గడిచినప్పటికీ కూడా రైతు భరోసా అందలేదు. సంక్రాంతి పండుగకు రైతు భరోసా అందజేస్తామని, లేదా 26 జనవరి కి అందజేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నప్పటికీ అది సాధ్యం కాలేదు.

Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. పంటలు వేసి రెండు మాసాలు గడిచినప్పటికీ కూడా రైతు భరోసా అందలేదు. సంక్రాంతి పండుగకు రైతు భరోసా అందజేస్తామని, లేదా 26 జనవరి కి అందజేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నప్పటికీ అది సాధ్యం కాలేదు.
రైతు భరోసా నిధులు దుర్వినియోగం కాకుండా పంటలు సాగుచేసిన రైతులకే ఆ నిధులు అందాలని ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు చేపట్టింది. అందుకు గాను రైతు భరోసా పథకంలో మార్పులు చేర్పులు చేసింది. ఖచ్చితంగా పంటలు సాగు చేసిన రైతులకే రైతు భరోసా అందించేందుకుగాను శాటిలైట్ సర్వే చేపట్టింది. శాటిలైట్ సర్వే వల్ల రైతు భరోసా ఆలస్యం అయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు.
ALSO READ : Hyderabad : ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు.. రూ.6 లక్షలు చోరీ, సీసీటీవీలో రికార్డు..!
ఇదిలా ఉండగా ఇటీవల రైతు భరోసా కోసం శాటిలైట్ సర్వేను ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పూర్తి చేశారు. ఈనెల 6వ తేదీన ప్రభుత్వానికి అధికారికంగా సర్వే వివరాలను అందించనున్నారు. కాగా సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రవ్యాప్తంగా 10% సాగుభూమి వానాకాలంతో పోల్చితే తగ్గినట్లుగా సర్వేలో వచ్చినట్లు సమాచారం. ప్రతి గుంట భూమి కూడా సాగు చేస్తేనే రైతులకు రైతు భరోసా అందించనున్నారు.
అయితే వానకాలం సీజన్ లో 69 లక్షల మందికి రైతులకు రైతు భరోసా పథకం అందింది. యాసంగి సీజన్ లో సాగు విస్తీర్ణం 10% తగ్గడం వల్ల రైతు భరోసా పథకం కూడా ఆనర్హులను తీసివేసే అవకాశం ఉంది. దాంతో రైతు భరోసా పథకం లో కొంతమంది రైతులు కట్ కానున్నారు. ఏదేమైనా శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సర్వే వివరాలు ప్రభుత్వానికి అందిన తర్వాత రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం ఉంది.
MOST READ
-
Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!
-
Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!
-
Suryapet : ఆరోగ్య ఉప కేంద్రానికి ఇంటి యజమాని తాళం.. రెండేళ్లుగా అద్దె చెల్లించని వైనం..!
-
Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!









