రాజకీయంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు.. 29వ వార్డులో డబ్బికార్ మల్లేష్ గెలుపుకు ప్రచారం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడలో బీఆర్ఎస్, సిపిఎం పార్టీల పొత్తు కుదిరింది. పట్టణంలోని 29వ వార్డు మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి డబ్బికార్ మల్లేష్‌కు మద్దతుగా భారీ ప్రచారం నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు.. 29వ వార్డులో డబ్బికార్ మల్లేష్ గెలుపుకు ప్రచారం..!

మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, బీ ఆర్ ఎస్ యువనేత సిద్ధార్థ ప్రచారం

మిర్యాలగూడ, మన సాక్షి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడలో బీఆర్ఎస్, సిపిఎం పార్టీల పొత్తు కుదిరింది. పట్టణంలోని 29వ వార్డు మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి డబ్బికార్ మల్లేష్‌కు మద్దతుగా భారీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, బీ ఆర్ ఎస్ యువనేత సిద్ధార్థ పాల్గొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా జులకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే సమర్థవంతమైన నాయకుడు డబ్బికార్ మల్లేష్. 29వ వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా మా పోరాటం సాగుతోందని పేర్కొన్నారు.

యువనేత సిద్ధార్థ మాట్లాడుతూ బంగారుగడ్డ (29వ వార్డు) సమగ్ర అభివృద్ధి బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి డబ్బికార్ మల్లేష్‌ కి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.

MOST READ 

Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!

BREAKING : రైలు నుంచి కింద పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది..!

BREAKING NEWS : గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..!

Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

మరిన్ని వార్తలు