Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

కోదాడలో బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష.. రూ.2వేలు జరిమానా..!

రోడ్డు ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్ డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష మరియు రూ.2000 జరిమానా విధిస్తూ కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి మహమ్మద్ ఉమర్ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై నవీన్ తెలిపారు.

కోదాడలో బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష.. రూ.2వేలు జరిమానా..!

అనంతగిరి, మన సాక్షి:

రోడ్డు ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్ డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష మరియు రూ.2000 జరిమానా విధిస్తూ కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి మహమ్మద్ ఉమర్ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2018 సంవత్సరం జనవరి నెలలో అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధి పాలారం తండా వద్ద స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మరణించారు. కోదాడ పట్టణానికి చెందిన ప్రైవేటు స్కూల్ బస్సు నడుపుతున్న షేక్ హుస్సేన్ మియా అను అతను బస్సును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పాలారం తండా గ్రామానికి చెందిన భూక్య కోటేశ్వరరావు అనే వ్యక్తి నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని డికొట్టడం జరిగినది అని అనంతగిరి ఎస్ఐ నవీన్ తెలిపారు.

ఈ ప్రమాద ఘటనలో భూక్య కోటేశ్వర రావు అక్కడికక్కడే మరణించగా మృతుని భార్య భూక్య మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ మంజునాథ రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి కేసు అభయోగ పత్రాలను ఆధారాలతో సహా న్యాయస్థానం నందు ఫైల్ చేయడం జరిగింది.

ఈ యొక్క విషయంలో కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి కేసు నందు సాక్షాదారాలను పరిశీలించి నిందితుడునీ అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్ల ప్రమాదం జరిగి వ్యక్తి మరణించాడని నిర్ధారించి బస్సు డ్రైవర్ అయినా షేక్ హుస్సేన్ మియా కు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష మరియు 2,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది.

2,000 రూపాయలు చెల్లించని యెడల అదనంగా మరో మూడు నెలల పాటు సాధారణ జైలు శిక్ష ఉంటుంది అని తీర్పును వెలువరించినారు. ఈ యొక్క కేసు నందు ప్రాసిక్యూషన్ తరపున ఎపిపి మహమ్మద్ గౌస్ పాషా కేసును వాదించినారు. అందుకు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించినట్లు ఎస్సై తెలిపారు.

MOST READ 

  1. Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

  2. Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. CM Revanth Reddy : బీఆర్ఎస్, బిజెపిలకు డిపాజిట్లు రావద్దు..!

  4. తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టిస్తున్న కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముంది..!

మరిన్ని వార్తలు