Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా డేట్ ఫిక్స్..!

తెలంగాణలో రైతులు యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. యాసంగి పంటలు సాగు చేసి రెండు మాసాలకు పైగా గడిచినప్పటికీ రైతు భరోసా అందలేదు.

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా డేట్ ఫిక్స్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులు యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. యాసంగి పంటలు సాగు చేసి రెండు మాసాలకు పైగా గడిచినప్పటికీ రైతు భరోసా అందలేదు. దాంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం రైతు భరోసా అదిగో ఇదిగో.. అంటూ కాలం గడుపుతోంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రైతు భరోసా అందజేయనున్నట్లు ప్రజా పాలన సభలో వెల్లడించారు. రైతులకు రాష్ట్రంలో 9వేల కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా అందజేస్తామని ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా కు కావలసిన తొమ్మిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్బిఐ ద్వారా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ ద్వారా రుణం తీసుకొని రైతులకు రైతు భరోసా అందజేయనున్నది. అందుకుగాను ఈనెల 10వ తేదీన ఆర్బిఐ తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమును ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వ అధికారులు రైతు భరోసా పథకానికి ఏర్పాట్లు సిద్ధం చేయనున్నారు.

శాటిలైట్ సర్వే పూర్తి :

రైతు భరోసాలో నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకుగాను పంటలు సాగు చేసిన రైతులకే అందజేయాలని ప్రభుత్వాన్ని నిర్ణయించింది. అందుకు గాను శాటిలైట్ ద్వారా సర్వే నిర్వహించారు. ఎన్ జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా శాటిలైట్ పంటల సర్వే పూర్తి చేశారు. కాగా శాటిలైట్ సర్వే ప్రకారం రైతులకు రైతు భరోసా పథకాన్ని వారి వారి ఖాతాలలో జమ చేయనున్నారు.

MOST READ 

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోరం.. సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన కారు, ఒక మృతదేహం లభ్యం..!

Miryalaguda : ఫర్టిలైజర్ యూరియా యాప్ పై మిర్యాలగూడలో రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి..!

TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

కోదాడలో బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష.. రూ.2వేలు జరిమానా..!

మరిన్ని వార్తలు