Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రుల రూ.1.50 లక్షల నగదు అందజేత..!

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా, తమ నిజాయితీని చాటుకుని ఆదర్శంగా నిలిచారు గుర్రంపోడు 108 సిబ్బంది. ప్రమాదానికి గురైన దంపతుల వద్ద ఉన్న లక్షా యాభై వేల రూపాయల నగదును వారి బంధువులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రుల రూ.1.50 లక్షల నగదు అందజేత..!

గుర్రంపోడు,, మన సాక్షి :

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా, తమ నిజాయితీని చాటుకుని ఆదర్శంగా నిలిచారు గుర్రంపోడు 108 సిబ్బంది. ప్రమాదానికి గురైన దంపతుల వద్ద ఉన్న లక్షా యాభై వేల రూపాయల నగదును వారి బంధువులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాదులోని ఉప్పల్ నివాసితులైన ఓర్సు రాంబాబు, నాగమణి దంపతులు వ్యక్తిగత పనిపై అంగడిపేట నుండి కురం పెళ్లికి కారులో బయలుదేరారు.

మార్గమధ్యంలో జూనూతుల స్టేజి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుర్రంపోడు 108 సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వెలుగు సత్యనారాయణ, పైలట్ మారేపల్లి వెంకటేశ్వర్లు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందిస్తూ అత్యవసర స్థితిలో దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం, కారులో లభించిన రూ. 1,50,000 నగదును సురక్షితంగా బాధితుడి బంధువైన అంజికి సిబ్బంది అందజేశారు. క్లిష్ట సమయంలో నగదును అప్పగించిన 108 సిబ్బంది నిజాయితీని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

  2. CM Revanth Reddy : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య..!

  3. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ వీడిందా.. ఆ రెండు రోజులు ఏం జరిగింది..!

  4. Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు