Nalgonda : ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు.

Nalgonda : ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం లోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని , నాగార్జునసాగర్ రోడ్ లో శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల లో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నల్గొండ ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు, మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు , నల్గొండ సమీపంలో ఉన్న నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దేవరకొండ, చండూరు చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి వార్డుకు ఒక కౌంటింగ్ టేబుల్ ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, కౌంటింగ్ హాల్లో బ్యారి కేడింగ్ ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని , ఓట్ల లెక్కింపు నిర్వహించే సిబ్బందికి శిక్షణను పూర్తి చేయడం జరిగిందని ,ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ అసిస్టెంట్, ఇద్దరు సూపర్వైజర్లు ఉంటారని,ఆర్ ఓ లు ఉంటారని,ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత,రెగ్యులర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు.
ఎక్కువ వార్డులు ఉన్నచోట పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్స్ లెక్కించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించడం జరగదని, ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Bandi Sanjay : లాఠీచార్జ్ లో గాయపడిన వారిని పరామర్శించిన కేంద్రం మంత్రి బండి సంజయ్..!
-
Municipal Elections : రెండు గంటల్లో నల్గొండ జిల్లాలో 17% పోలింగ్.. మిర్యాలగూడలో పదివేల ఓట్లు పోల్..!
-
Miryalaguda : మిర్యాలగూడలో చికెన్ చిట్టీలు..!
-
ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!










