Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

Danger : ప్రమాదకరంగా ప్రయాణం.. పట్టించేది..!

Danger : ప్రమాదకరంగా ప్రయాణం.. పట్టించేది..!

వెల్దండ, మన సాక్షి:

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం మహాత్మా గాంధీ కాలనీ తండా నుంచి పోతేపల్లికి వెళ్లే మట్టి రోడ్డుపై కల్వర్టు దగ్గర పెద్ద గొయ్యి ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. దానికి మరమతులైన చేయక రోజురోజుకు గోతి పెద్దదవుతూ వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారుతుంది.

రాత్రిపూట వచ్చే వారి ప్రాణాలకు ఎక్కువ పరిణమించింది. ఇప్పటికే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. పలుమార్లు ద్విచక్ర వాహనదారులు ఇక్కడ పడిపోయి గాయపడ్డారు. రైతులు తమ పశువులను తోలుకేలుతున్న సమయంలో వాటి కాళ్లు గోతిలో ఇరుక్కుంటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

గోతి వద్ద మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు అధికారుల , ఆర్ అండ్ బి అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా గెలిచిన సర్పంచ్ రోడ్డు గొయ్యిని పూడ్చివేస్తారని గ్రామస్తులు, వాహనదారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు