Breaking Newsజిల్లా వార్తలునిజామాబాద్వ్యవసాయం

తుఫాన్ తో తడిసిన పసుపు.. రైతులకు భారీ నష్టం..!

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలో సోమవారం తుఫాన్ వల్ల కురిసిన వర్షానికి పసుపు, జొన్న రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు.

తుఫాన్ తో తడిసిన పసుపు.. రైతులకు భారీ నష్టం..!

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలో సోమవారం తుఫాన్ వల్ల కురిసిన వర్షానికి పసుపు, జొన్న రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఎర్ర జొన్నలు పంటలు ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్నాయి. పసుపు దొబ్బి ఉడకబెట్టి ఆరేసిన పసుపు తడవడంతో రైతులు ఉక్కిరి బుక్కిరవుతున్నారు.

పలు గ్రామాల్లో ఈ పంటలు విస్తృతంగా పండించారు. సోమవారం కురిసిన వర్షం 24 గంటల్లో 50-60 మి.మీ. వరకు కురిసింది. ఇది కోతకు వచ్చిన పంటలను పూర్తిగా దెబ్బతీసింది. రైతులు”పంట కోసి మార్కెట్‌కు తీసుకెళ్లే ముందే తడవడంతో ధర తగ్గి, నష్టం మాత్రమే ఖాయం” అంటూ నిరాశలో మునిగారు.

ఈ వర్షాలకు మబ్బులకు ఎర్ర జొన్నల కంకికి తేనె పట్టి జొన్న కంకి ఖరాబ్ అవుతుందని రైతులు తెలిపారు. అధికారులు రైతులకు సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: 

మరిన్ని వార్తలు