Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

NagarjunaSagar : విశ్వశాంతి కోసం బౌద్ధ దమ్మయాత్ర..!

ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ సుమారు 403 కిలోమీటర్ల మేర కర్ణాటక గుల్బర్గా సిద్ధార్థ బుద్ధ విహార నుండి నాగార్జునసాగర్ బుద్ధవనానికి మార్చి ఒకటవ తేదీ సాయంత్రం చేరుకోనుంది. ఈ యాత్ర ద్వారా తెలంగాణకు బుద్ధుని శాంతి సందేశ క్రాంతి రానున్నదని గగన్ మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గగన్ మాలిక్ అన్నారు.

NagarjunaSagar : విశ్వశాంతి కోసం బౌద్ధ దమ్మయాత్ర..!

నేడు నాగార్జునసాగర్ కు బౌద్ధ దమ్మయాత్ర 

నాగార్జునసాగర్,, మన సాక్షి :

ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ సుమారు 403 కిలోమీటర్ల మేర కర్ణాటక గుల్బర్గా సిద్ధార్థ బుద్ధ విహార నుండి నాగార్జునసాగర్ బుద్ధవనానికి మార్చి ఒకటవ తేదీ సాయంత్రం చేరుకోనుంది. ఈ యాత్ర ద్వారా తెలంగాణకు బుద్ధుని శాంతి సందేశ క్రాంతి రానున్నదని గగన్ మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గగన్ మాలిక్ అన్నారు. దమ్మయాత్ర మార్చి 1వ తేదీన ఆదివారం బుద్ధవనం చేరుకుంటున్న సందర్భంగా బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మహారాష్ట్రకు చెందిన అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిద్ధార్థ హిట్టెంబరి లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

సుదూర ప్రాంతం సుమారు 403 కిలోమీటర్ల మేరకు పాదరక్షలు లేకుండా రక్తాలు కారుతున్న కాళ్లకు బట్టలతో కట్టుకొని ఎంతో సాహసంగా ప్రపంచ శాంతి బౌద్ధ ధర్మాన్ని ప్రజలలోకి తీసుకవెళ్లాలని ఆకాంక్షతో బుద్దవనానికి చేరుకోనున్న దమ్మ పాదయాత్ర బౌద్ధ భిక్షువులను, ఉపాసకులను ఘనంగా స్వాగతం పలకాలని వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

బౌద్ధ దమ్మాని ప్రజలకు, అత్యంత సామాన్యులకు,సకల జనులకు చేరవేసేందుకు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ నడిచిన బుద్ధ ధర్మాన్ని అందరూ తెలుసుకుని ఆచరించాలని అప్పుడే సమాజంలో స్నేహభావం, సోదర తత్వం, శాంతి తత్వం, కరుణ, మైత్రి పెంపొందుతుందని అన్నారు.ఎంతో శ్రమకోర్చి
మౌనమే వారి సందేశముగా వస్తున్న ధమ్మా యాత్ర యొక్క నిశ్శబ్దము ఒక శాంతి తుఫానును సృష్టించబోతుందని ఆ మార్గం అందరికీ అనుసరణనీయమనిఉంటుందని ఆకాంక్షించారు.

అనంతరం బుద్ధవనం అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ థాయిలాండ్ నుండి దమ్మయాత్ర ద్వారా వస్తున్న బుద్ధ ధాతువులను ఈ యాత్ర పొడుగునా ఎంతోమంది ప్రజలు సందర్శించారని ఇంత పవిత్రమైన బౌద్ధ ధాతువులు బుద్ధ వనములో మూడు రోజులు పాటు మహా స్థూపం లో పెట్టబోతున్నామని ఇక్కడి ప్రజలు చుట్టుపక్కల నుండి అనేకమంది బుద్ధ ధాతులను దర్శించుకోవాలన్నారు.

మార్చి 1న బుద్ధ వనానికి దమ్మయాత్ర చేరుకుంటుందని, రెండవ తేదీన సాయంత్రం బుద్ధునితో నా ప్రయాణం అనే నాటకంతో ముగుస్తుందని, మూడవ తేదీన దమ్మ ధ్యానంతో బుద్ధవనం పరిసరాలు ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకోను న్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,మంత్రి వివేక్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్న ట్లుగా తెలిపారు. మసీదులు,చర్చిలు,దేవాలయాలు, ధర్మ ప్రచార సంస్థలు ఈ యాత్ర పొడుగునా కులమతాలకు అతీతంగా దమ్మయాత్రకు ఘన స్వాగతం పలికారులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి థాయిలాండ్ సన్ సక్ కోవిడో ఆధ్వర్యంలో బౌద్ధ భిక్షువులు థాయిలాండ్ నుండి భారతదేశం నుండి సుమారు 80 మంది బిక్షువులు పాల్గొంటున్నారని, అక్షయ ఫౌండేషన్ అధ్యక్షులు సిద్ధార్థ, మంత్రి వివేక్ వెంకటస్వామి, కర్ణాటక గుల్బర్గా సిద్ధార్థ బుద్ధ విహార సంస్థలు, గగన్ మాలిక్ ఫౌండేషన్ సంస్థ ఈ దమ్మయాత్రకు నాయకత్వం వహిస్తున్నారన్నారు.

లతరాజా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేకే రాజా ఈ కార్యక్రమానికి కావలసిన చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బుద్ధవనం ఆర్ట్స్ మరియు ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు