Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా

తురక, కాశల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి.. హరీశ్ రావుకు వినతి..!

రానున్న అసెంబ్లీ సమావేశంలో తురక కాశ సమస్యలపై గళం విప్పాలని తురక కాశ నాయకులు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హరీష్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

తురక, కాశల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి.. హరీశ్ రావుకు వినతి..!

సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి:

రానున్న అసెంబ్లీ సమావేశంలో తురక కాశ సమస్యలపై గళం విప్పాలని తురక కాశ నాయకులు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హరీష్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

తురక కాశ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బడే సాబ్ మాట్లాడుతూ తురక కాశలు బండల కింద చితికి పోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని, తమను గుర్తించి తమ అభివృద్ధికి కృషి చేయాలని, సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీలో తమ గురించి మట్లాడాలని కోరారు.

హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీలో తప్పకుండా ప్రస్తావిస్తానని,తురక కాశల అభివృద్ధి గురించి కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్,లీగల్ సెల్ అడ్వైజర్ యామిన్ భాషా,ఉపాధ్యక్షులు షాదుల్లా,వలీ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గౌస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షేక్ మౌలాన, నాయకులు అబ్దుల్ కరీం, గౌస్, రషీద్, హైదర్, ఖధార్, ఆలీ, ఖాసీం, రుక్ముద్దీన్, కరీం, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు