TOP STORIESBreaking Newsతెలంగాణ

TG : మహిళా సంఘాలకు భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల కోసం భారీ శుభవార్త ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

TG : మహిళా సంఘాలకు భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

మన సాక్షి :

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల కోసం భారీ శుభవార్త ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మహిళల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ ప్రక్రియను ప్రారంభించనున్నది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రతి మహిళకు సుమారుగా 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించింది.

‘పబ్లిక్ గవర్నెన్స్ – ప్రోగ్రెస్ ప్లాన్’ (99 రోజుల ప్రణాళిక) సమీక్షా సమావేశంలో ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రులలో సాధారణ వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మంత్రి అధికారులను ఆదేశించారు.

ALSO READ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టత..!

మొదటి దశ (మార్చి 6 – మార్చి 31): ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలు మరియు వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించబడతాయి. మహిళా సంఘాల సభ్యుల స్క్రీనింగ్‌ను ప్రతి జిల్లాలోని ఐదు మండలాల్లో మొదటగా ప్రారంభించి, ఆపై మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు.

రెండవ దశ (ఏప్రిల్ 1 – ఏప్రిల్ 15): అంటువ్యాధి కాని వ్యాధుల గుర్తింపుపై దృష్టి సారిస్తారు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించడానికి ఉప కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడతాయి.

మూడవ దశ (ఏప్రిల్ 16 – మే 15): అధికారులు ఇన్ఫెక్షన్ నియంత్రణ, ప్రజారోగ్య సంసిద్ధతపై దృష్టి పెడతారు. ముఖ్యంగా, క్షయ (TB) నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయబడతాయి. వడదెబ్బ, డెంగ్యూ మరియు మలేరియా వంటి కాలానుగుణ వ్యాధులపై ప్రజల్లో అవగాహన, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుతారు.

నాల్గవ దశ (మే 16 – జూన్ 12): పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరిస్తారు. GHMC, సైబరాబాద్, మేడ్చల్ పరిధిలోని 145 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (UPHCలు) మల్టీ-స్పెషాలిటీ సేవలను అందించే ‘పాలీక్లినిక్‌లు’గా అప్‌గ్రేడ్ చేయబడతాయి. మొబైల్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు.

MOST RAED : 

మరిన్ని వార్తలు