Gold Price : బంగారం ధర వరుసగా తగ్గుతుంది తెలుసా.. ఈరోజు ఎంతంటే..!
బంగారం ధర తగ్గుతూ వస్తుంది. నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతుంది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగానే బంగారం ధర తగ్గుతుందని భావిస్తున్నారు.

Gold Price : బంగారం ధర వరుసగా తగ్గుతుంది తెలుసా.. ఈరోజు ఎంతంటే..!
మనసాక్షి, వెబ్ డెస్క్:
బంగారం ధర తగ్గుతూ వస్తుంది. నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతుంది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగానే బంగారం ధర తగ్గుతుందని భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో బంగారంకు కూడా ధర తగ్గుతుందని చెప్పవచ్చును. గురువారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 9800 తగ్గింది.
వరుసగా తగ్గుతున్న బంగారం ధర :
మార్చి 2వ తేదీ నుంచి బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తుంది. 24 క్యారెట్ 10 గ్రాములకు గత నాలుగు రోజులుగా తగ్గిన వివరాలు.
- మార్చి 2వ తేదీన 2580 తగ్గింది.
- మార్చి 3వ తేదీన 2890 రూపాయలు తగ్గింది.
- మార్చి 4వ తేదీన 3110 రూపాయలు తగ్గింది.
- మార్చి 5వ తేదీన 980 రూపాయలు తగ్గింది.
అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం కు గత నాలుగు రోజుల నుంచి తగ్గుతున్న ధరల వివరాలు
- మార్చి 2వ తేదీన 2350 తగ్గింది.
- మార్చి 3వ తేదీన 2650 తగ్గింది.
- మార్చి 4వ తేదీన 2850 తగ్గింది.
- మార్చి 5వ తేదీన 900 రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే..?
గురువారం (05.03.2026) బంగారం ధర హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో 24 క్యారెట్స్ బంగారం కు 10 గ్రాములకు 980 రూపాయలు తగ్గి 1,63,530 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం కు 900 రూపాయలు తగ్గి 1, 49, 000 రూపాయలుగా ఉంది.









