Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డిహైదరాబాద్

ACB : జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..!

శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు.

ACB : జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..!

శేరిలింగంపల్లి, మన సాక్షి:

శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటరీ విభాగాలు సహా వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారులను ఏసీబీ అధికారులు విచారించారు.ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రాథమిక దర్యాప్తులో కొన్ని చిన్నపాటి అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.తనిఖీల పై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు లు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

అయితే తనిఖీల సమయంలో ఎటువంటి నగదు లభించలేదని, కానీ పలు ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు