Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : రోడ్డు మంజూరు చేయాలని మోకాళ్లపై నిరసన..!

తుంగతుర్తి మండలం లో బండరామారం నుండి గుండెపురి తారు రోడ్డు వెంటనే మంజూరి చేయాలి అని బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మోకాళ్లపై నిరసన తెలిపారు.

Suryapet : రోడ్డు మంజూరు చేయాలని మోకాళ్లపై నిరసన..!

తుంగతుర్తి, మన సాక్షి :

తుంగతుర్తి మండలం లో బండరామారం నుండి గుండెపురి తారు రోడ్డు వెంటనే మంజూరి చేయాలి అని బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మోకాళ్లపై నిరసన తెలిపారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లో ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందని మారిన రాజకీయ పరిణామాల్లో రాష్ట్రం లోఎర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈ రోడ్డు పై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు.

తుంగతుర్తి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి వందల వేల కోట్లు తీస్తున్నామని చెప్పిన ఎమ్మెల్యే మందుల సామేలు మీరు చెప్పే కోట్ల రూపాయల అభివృద్ధిలో బండరామారం, గుండెపురి రోడ్డు మంజూరి చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. అలాగే నియోజవర్గంలో మండలంలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న అన్ని రోడ్లను ఎండాకాలం లోపు పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ నాయకులు ఆకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్, కోటమర్తి సైదులు,కోరుకొప్పుల వెంకన్న,కోరుకొప్పుల ఉప్పలయ్య, భైరోజు సోమ నరసయ్య,గడ్డం సూరయ్య,పొదిలి కిష్టయ్య, యమా రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు