Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన..!

పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న పెరుమాళ్ళ హాస్పిటల్ లో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందారని బంధువులు ఆరోపించిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Nalgonda : వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన..!

నల్లగొండ, మన సాక్షి :

పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న పెరుమాళ్ళ హాస్పిటల్ లో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందారని బంధువులు ఆరోపించిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందారని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించగా ఆస్పత్రి సిబ్బంది తమపై దాడి చేసినట్టు బంధువులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల ప్రకారం..

తిప్పర్తి మండలం రాజుపేట చెందిన దాసరి నాగయ్య 40 సంవత్సరాలు జ్వరంతో బాధపడుతూ ఈనెల ఆరవ తేదీన ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలిపారు. కాగా మూడు రోజుల నుండి ఆసుపత్రి వైద్యులు జానయ్యకు చికిత్స అందిస్తున్నారు కాగా సోమవారం పరిస్థితి బాగా లేకుంటే తాము హైదరాబాద్ కు తీసుకెళ్తామని చెప్పిన వినకుండా ఏం కాదు ఎక్కడైనా ఒకటే ట్రీట్మెంట్ అని ఇక్కడే ఉంచుకొని చికిత్స అందిస్తుండగా మరణించినట్లు తెలిపారు.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే నాగయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహిస్తే తమపై ఆసుపత్రి సిబ్బంది దాడి చేసినట్లు బంధువులు తెలిపారు. టూ టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏటువంటి సంఘటనలు జరుగుకుండా చర్యలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు